చేపల వేటకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
విద్యార్థులు మృతి | సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది.

కామారెడ్డి : సరదాగా చేపల వేటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలోని నిజాంసాగర్ మండలం సింగీతం గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పట్లోల్ల రామకృష్ణ, పట్లోల్ల సాయిలు ఇద్దరు అన్నదమ్ములు. వీరి కుమారులు శ్రీకాంత్ (15), సంతోష్(17) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామంలోని కోటకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.
చేపలు పడుతుండగా కాలుజారి కుంటలో పడ్డారు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మృతులు శ్రీకాంత్ 9, సంతోష్ 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముక్నునాయి. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వాన
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయండి
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

