ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 27, 2020 , 17:14:35

మేకల కాపరిపై పులి దాడి..పరిస్థితి విషమం

మేకల కాపరిపై పులి దాడి..పరిస్థితి విషమం

ఆదిలాబాద్‌ ‌:  జిల్లాలోని భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామం వద్ద పెన్‌గంగ నది తీరానికి అవతల పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర వగ్యారా గ్రామంలో పెద్ద పులి హల్‌ చేసింది. సేనాపతి బిజారామ్‌ అనే మేకలకాపరిపై గురువారం దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడు తప్పించుకున్నాడు. ప్రస్తుతం యవత్‌మాల్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని అక్కడి పోలీస్‌ పటేల్‌ ద్వారా తెలిసింది. 

ఇటీవల భీంపూర్‌ మండల పెన్‌గంగ నది ఒడ్డున ఉన్న గొల్లగడ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర టేంబి పల్లెలో పత్తి చేనులో ఉన్న ముసలమ్మను పులి చంపేసింది. మహారాష్ట్ర ఇవ్‌రీ గ్రామంలో కూడా పులి అప్పుడప్పుడు కనిపిస్తున్నదని గంగపుత్రులు చెబుతున్నారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచే పెన్‌గంగ దారిలో పులులు వలస వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు. పులుల సంచారంపై పెన్‌గంగ నది సమీపంలో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ పల్లెల్లో ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 







logo