శనివారం 16 జనవరి 2021
Crime - Nov 17, 2020 , 14:44:39

దొంగ‌లు ప‌ట్టివేత‌.. విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి

దొంగ‌లు ప‌ట్టివేత‌.. విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి

నిజామాబాద్‌ : దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా పాతంగల్‌ శివారులో చోటుచేసుకుంది. దొంగలను పట్టుకున్న పాతంగల్‌ గ్రామస్థులు వారిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పంగించారు.