చెన్నై: ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. విద్యార్థుల నిరసనతో దిగి వచ్చిన పోలీసులు చివరకు ఆ టీచర్‌ను అరెస్ట్ చేశారు. తమిళనాడు కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ స్కూలులో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని కొన్ని నెలల కిందట సూసైడ్ చేసుకున్నది. కాగా, 31 ఏండ్ల ఫిజిక్స్ టీచర్ మరో ఇద్దరి విద్యార్థినులను కూడా లైంగికంగా వేధించినట్లుగా ఆడియో క్లిప్‌లు వాట్సాప్‌లో షేర్ అయ్యాయి. దీనిపై ఆ స్కూలు విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. స్పందించిన పోలీసులు ఆ ఫిజిక్స్ టీచర్‌తోపాటు విద్యార్థిని ఫిర్యాదుపై స్పందించని హెడ్మాస్టర్ను కూడా అరెస్ట్ చేశారు.
మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి కాకుండా స్కూళ్లలో చర్యలు చేపట్టారని అధికారులను ఆదేశించారు. నిందితులను చట్టబద్ధంగా శిక్షించి మహిళలకు భద్రత కల్పించాలని సూచించారు.