Drug Racket | భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించారు.
Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించారు. ఈ దందాలో తమిళనాడుకు చెందిన ఓ సినీ నిర్మాత (Tamil film producer ) కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ డ్రగ్ నెట్వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తుల్ని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను (pseudoephedrine) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో కొన్ని సరకుల ద్వారా దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
గత 3 ఏళ్లలో వీరు మొత్తం 45 సరకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు మొత్తం నెట్‌వర్క్‌ను చేధించడానికి ఆయా దేశాల్లో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేయడానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు పోలీసులు (police) వెల్లడించారు.
కాగా, సూడోపెడ్రిన్ (Pseudoephedrine)ను మెథాంఫేటమిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ఔషధం. దీనిని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు.
Also Read..
Alexei Navalny | గుండెపై ఒకే పంచ్.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?
Mann Ki Baat | లోక్‌సభ ఎన్నికలు.. మన్ కీ బాత్కు తాత్కాలిక బ్రేక్
firecracker | బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

