17 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్తీ విత్తనాలు నిల్వ చేశారనే విశ్వసనీయ సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామన్నారు.
అడివి రావుల చెరువు గ్రామంలో బోయ తిమ్మయ్య, నారాయణ, సవారన్న తమ పొలం దగ్గర గుడిసె లో 12.5 క్వింటాల నకిలీ విత్తనాలను దాచుకొని పెట్టుకోగా టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల ఫర్యాదు మేరకు వాపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు.
అలాగే బోయ తిరుమల్, ఉప్పరి పెద్ద వీరన్న ఇండ్లలో తనిఖీలు చేపట్టి 3 క్వింటాల నకిలీ విత్తనాలు, తాటి కుంట గ్రామంలోని నాయకి మధు ఇంట్లో సోదాలు నిర్వహించి 170 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని మండల ఏవో రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లా లో ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన ప్రజలు స్వచ్చందంగా సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు.
లేదా డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నెం -9494921100 కు సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

