Thief arrested | పుత్తడి అనుకొని.. దొంగిలిస్తే.. కథ అడ్డం తిరిగింది

బంజారాహిల్స్ : అర్థరాత్రి ఒంటినిండా నగలతో మహిళ ఒంటరిగా కనిపించింది.. రోడ్డుమీద నిలబడి లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరడంతో ఆమెను స్కూటర్‌పై ఎక్కించుకున్న ఓ ఆటోడ్రైవర్‌కు దుర్భుద్ది పుట్టింది. నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లి ఆభరణాలు ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు రాయితో దాడి చేయడంతో వాటిని తీసి ఇచ్చింది.
కాసేపటికి ఆ రోడ్డున వెళ్తున్న ఓ యువకుడు గమనించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆఘామేఘాల మీద దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడివద్ద ఉన్న ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవన్నీ గిల్టు నగలని తేలడంతో పోలీసులతో పాటు చోరీకి పాల్పడిన ఆటోడ్రైవర్ అవాక్కయ్యారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బోరబండ సమీపంలోని వినాయక్రావునగర్ బస్తీకి చెందిన మహిళ (36) ఈ నెల 29న అర్థరాత్రి దాటిన తర్వాత బోరబండలోని విజేత థియేటర్ వద్ద రోడ్డుపై నిలబడి ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడుగుండడంతో అదే రోడ్లో వెళ్తున్న ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌కు చెందిన సయ్యద్ దస్తగిర్ (40) తన స్కూటర్‌ను అపాడు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మహిళను తన స్కూటర్‌పై ఎక్కించుకున్న దస్తగిర్ బోరబండ వైపుకు తీసుకు వెళ్లకుండా యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోట వైపుకు తీసుకువచ్చాడు. నిర్మానుష్యమైన ప్రాంతంలో స్కూటర్‌ను ఆపిన దస్తగిర్ ఆమెను మాటల్లోకి దించడంతో పాటు మెడలోని బంగారు గొలుసు, చెవికమ్మలు, ముక్కు పుల్ల ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తానంటూ రాయితో కొట్టాడు.
దీంతో భయాందోళనకు గురయిన మహిళ వాటిని తీసి ఇచ్చింది. దాంతో స్కూటర్‌పై దస్తగిర్ పరారయ్యాడు. కాసేపటికి అదే రోడ్డుపై వెళ్తున్న సమీర్ అనే యువకుడు ఆమెను గమనించి డయల్ 100కు కాల్ చేసి విషయం చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న మహిళను ప్రశ్నించగా తనవద్దనున్న ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి తీసుకుని వెళ్లాడంటూ చెప్పింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దారిపొడువునా సీసీ కెమెరాలు పరిశీలించగా ఎర్రగడ్డ సుల్తాన్నగర్లోని దస్తగిర్ ఆచూకీ తెలిసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడి ఇంట్లో సోదా చేయగా మహిళ వద్దనుంచి లాక్కున్న ఆభరణాలు లభ్యమయ్యాయి.
వాటిని పరిశీలించగా అవి రోల్డ్గోల్డ్వి అని తేలింది. దాంతో స్వర్ణకారుడిని పిలిచి పరీక్షించగా వాటిలో ముక్కు పుడక మాత్రమే బంగారమని, మిగిలినవన్నీ రోల్డ్గోల్డ్వని తేలడంతో పోలీసులతో పాటు వాటిని తస్కరించిన దస్తగిర్ కూడా అవాక్కయ్యాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

