ముంబై: ఏటీఎంను పగులగొట్టిన దొంగలు అందులోని రూ.2.5 లక్షల నగదును చోరీ చేశారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యరాత్రి దాటిన తర్వాత యావత్ పట్టణంలోని ఒక జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంను దొంగలు లూఠీ చేశారు. గ్యాస్ కట్టర్‌తో దానిని కట్ చేసి తెరిచారు. ఏటీఎంలోని రూ.2.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దీనికి ముందు అక్కడి సీసీటీవీ కెమేరాలకు నల్లరంగు పూశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పూణే రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు.