మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..
Software Company | మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. అనంతరం టెలిఫోన్లోనే
హైదరాబాద్ : మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది ఆ కంపెనీ. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. అనంతరం టెలిఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆన్లైన్లోనే ఆఫర్ లెటర్లు జారీ చేసింది. శిక్షణ అనంతరం మోసం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. డన్యోన్ ఐటీ టెక్నాలజీ కంపెనీ కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన జారీ చేసింది. ఉద్యోగాల కోసం సంప్రదించిన వంద మంది పైబడి ఉద్యోగుల నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసింది. ఇక టెలిఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించింది. అర్హులైన వారికి ఆఫర్ లెటర్లు జారీ చేసింది. ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చింది. త్వరలోనే ప్రాజెక్టు ఇస్తామంటూ ఆ కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు ప్యాకేజీ ప్రకటించారు. అయితే ప్రాజెక్టు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డన్యోన్ ఐటీ టెక్నాలజీ కంపెనీ యజమాని ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ రూ.500 కోట్లా?
Revanth Reddy | మిమ్మల్ని రిగ్గింగ్ చేయమనట్లే.. నూతన డీఎస్పీల మాటామంతిలో రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
KTR Rythu Garjana | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు నిర్మల్‌లో కేటీఆర్ రైతుగర్జన
DSP Recruitment | పోలీస్ అకాడమీలో 35శాతం ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. నియామకాల్లో భారీ గోల్ మాల్ జరిగిందా?
సిటీ మెట్రోకు నై.. నోయిడా మెట్రోకు సై.. ఏడాదిలోనే ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

