చెన్నై: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడ్ని ఆ ఇంటి పెంపుడు కుక్క పట్టిచ్చింది. తమిళనాడులోని సెల్వపురంలో శనివారం ఈ ఘటన జరిగింది. 30 ఏండ్ల మహిళ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఒక షెడ్లో వేరుగా ఉంచారు. స్వర్ణకారుడైన 29 ఏండ్ల దిలీప్‌కుమార్ రాత్రి వేళ ఆ ఇంటికి వచ్చాడు. ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడంతోపాటు మొబైల్లో చిత్రీకరించాడు.
అనంతరం దిలీప్ అక్కడి నుంచి పారిపోతుండగా ఆ ఇంటి పెంపు కుక్క అతడ్ని పట్టుకున్నది. అతడి ఫ్యాంట్‌ను గట్టిగా పట్టుకుని కదలనీయకుండా చేసింది. అలికిడికి మిగతా కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ఆ షెడ్ వద్దకు వెళ్లి చూడగా నిందితుడ్ని కుక్క పట్టుకున్న విషయాన్ని గమనించారు.
వెంటనే అతడ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు వచ్చి నిందితుడు దిలీప్‌ను సోదా చేయగా మొబైల్ ఫోన్లో అసభ్య వీడియోలు కనిపించాయి. అతడ్ని ప్రశ్నించగా మతిస్థిమితం లేని ఆ మహిళపై రెండు సార్లు లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.