ఆస్తి కోసం వృద్ధ తల్లిని తీవ్రంగా హింసించిన కొడుకు, కోడలు

నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కోటయ్య, కిష్టమ్మ(60) ఇరువురు దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. ఉన్న 20 ఎకరాల్లో ఇద్దరి కొడుకులకు చెరో 8 ఎకరాలు పంచి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా తమ పోషణ నిమిత్తం నాలుగు ఎకరాలు తమ వద్దే ఉంచుకున్నారు. పొలంలో ఇల్లు కట్టుకుని అక్కడే వేరేగా ఉంటూ జీవిస్తున్నారు.
కాగా ఉన్న నాలుగు ఎకరాలను కూడా తన పేర రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా పెద్ద కొడుకు ఎట్టె సూరయ్య అతడి భార్య భూదేవి ఇరువురు కలిసి వృద్ధురాలైన కిష్టమ్మ కళ్లలో కారం చల్లి కొడవలితో దాడి చేశారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న నిడమనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం బాధితురాలిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం భార్యాభర్తలిద్దరూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. కిష్టయ్య 2019లో ఆస్తి విషయంలో గొడవపడి తల్లిపై కర్రతో దాడి చేసినట్లుగా సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

