బాలిక యూనిఫాం విప్పిన టీచర్… చైల్డ్ కమిటీ ఫిర్యాదుతో అరెస్ట్
ఐజ్వాల్: క్లాస్‌లో అంతా చూస్తుండగా బాలిక యూనిఫాం విప్పిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిజోరంలోని లుంగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంగ్పుయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్బియాకెంగి అనే మహిళ కాంట్రాక్ట్ టీచర్‌గా పని చేస్తున్నది. ఈ నెల 22న ఒకటవ తరగతి చదువుతున్న బాలికను క్లాస్‌లోని ఒక బాలుడు కొట్టాడు. దీంతో ఆ చిన్నారి గాయపడింది. చికిత్స అనంతరం మూడు రోజులకు ఆ బాలిక తిరిగి స్కూల్‌కు వెళ్లింది. అయితే ఈ నెల 25న కూడా అదే బాలుడు ఆ బాలికను మళ్లీ కొట్టాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి శుక్రవారం ఆ స్కూల్‌కు వెళ్లి నిలదీసింది. తన కుమార్తెను కొట్టిన బాలుడ్ని తిట్టింది. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమెకు స్కూల్ టీచర్ లాల్బియాకెంగి ఫోన్ చేసింది. బాలుడ్ని తిట్టిన ఆమె స్కూల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది.
ఆగ్రహించిన ఆ మహిళ వెంటనే ఆ ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లింది. తన కుమార్తెను వేరే స్కూల్లో చేరుస్తానని చెప్పింది. అయితే ఆ బాలిక స్కూల్ యూనిఫాం విడిచి వెళ్లాలని, మరో విద్యార్థికి ఆ యూనిఫాం అవసరం ఉందని టీచర్ లాల్బియాంకెంగి చెప్పింది. ఈ నేపథ్యంలో క్లాస్‌లోనే అందరి ముందు ఆ చిన్నారి స్కూల్ డ్రెస్‌ను ఆ టీచర్ విప్పింది. ఆ బాలికను కేవలం అండర్‌వేర్‌తో స్కూల్ నుంచి ఇంటికి పంపింది.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర పిల్లల సంక్షేమ కమిటీ ఈ సంఘటనపై స్పందించింది. బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించడంతోతోపాటు క్లాస్‌లోని మిగతా విద్యార్థుల ముందు స్కూల్ యూనిఫాం తొలగించి అండర్‌వేర్‌తో ఇంటికి పంపిన ఆ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో టీచర్ లాల్బియాంకెంగిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

