పెండ్లి మండపంలో భారీ అగ్నిప్రమాదం… 12 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు
న్యూఢిల్లీ: ఎండలు మండుతుండటంతో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోహిణి ప్రాంతంలో ఒక పెండ్లి వేడుక జరుగుతుండగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెండ్లి మండపం పూర్తిగా కాలిపోయింది. మధ్యాహ్నం 1.48 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గంటకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు.
కాగా, రోహిణి ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ఉన్న సీఎన్జీ స్టేషన్ సమీపంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్మేశాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు గాలులు కూడా మంటలకు తోడయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
మరోవైపు పెండ్లి వేడుక జరిగిన సమీపంలోనే సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ ఉండటంతో స్థానికులు మరింత ఆందోళన చెందారు. పెండ్లి మండపం చెక్కతో తయారు చేయడం మంటల వ్యాప్తికి కారణంగా తెలుస్తున్నది. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్నది తెలియలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అతడికి ప్రాథమిక చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

