వివాహేతర బంధం : భార్య ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు!

పట్నా : వివాహేతర బంధం నిండు కుటుంబంలో మంటలు రేపింది. అక్రమ సంబంధం నెరపుతున్నారనే ఆగ్రహంతో భార్య ప్రియుడికి నిప్పంటించిన వ్యక్తి ఉదంతం భోపాల్‌లో మంగళవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో 50 శాతం పైగా కాలిన గాయాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భోపాల్‌కు చెందిన బాధితుడు అరవింద్ అహిర్వార్ నిందితుడి భార్య అర్చనాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అహిర్వార్‌తో అర్చన డేటింగ్ చేయడం నిందితుడు శేఖర్‌కు ఆగ్రహం తెప్పించింది. భర్త హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టిన అర్చన తరచూ అహిర్వార్ను కలవడం కొనసాగిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ఇండోర్ వెళ్లారు. అర్చన గురించి మాట్లాడాలని అహిర్వార్ను ఝాన్సీకి పిలిపించిన శేఖర్ అతడిని నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితుడి కేకలు విన్న స్ధానికులు అతడిని కాపాడారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు నిందితుడు శేఖర్‌తో పాటు అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

