Cyber Fraud | ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ : మెరుగైన రిటన్స్ పేరుతో రూ. లక్ష కొట్టేశారు..!
సైబర్ నేరాలపై ప్రభుత్వం, పోలీసులు ప్రజల్లో ఎంతగా అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా అమాయాకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు.
ముంబై : సైబర్ నేరాలపై ప్రభుత్వం, పోలీసులు ప్రజల్లో ఎంతగా అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా అమాయాకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి స్కామర్లు రూ. లక్ష కొట్టేశారు. ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి ఆరా తీస్తన్న ముంబై నగరంలోని పన్వేల్‌కు చెందిన 27 ఏండ్ల యువకుడిని స్కామర్లు బోల్తా కొట్టించారు.
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే భారీ రిటన్స్ వస్తాయని టెలిగ్రాం యాప్‌లో బాధితుడిని స్కామర్లు నమ్మబలికారు. బాధితుడిని ముందుగా రూ. 1000 ఇన్వెస్ట్ చేయాలని కోరిన నేరగాళ్లు అతడు ఆ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వెంటనే బాధితుడి టెలిగ్రాం ఖాతాలో రూ. 1620 బ్యాలెన్స్ చూపింది. ఇన్వెస్ట్‌మెంట్‌పై బాధితుడు ఏకంగా రూ. 620 ఆర్జించడంతో స్కామర్లు అతడి నమ్మకం చూరగొన్నారు.
ఆపై రూ. లక్ష ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు కోరగా అతడు అంతే మొత్తం పెట్టుబడి పెట్టగా బాధితుడి టెలిగ్రాం ఖాతా బ్యాలెన్స్ ఏకంగా రూ . 2.2 లక్షలు చూపింది. దీంతో బాధితుడు టెలిగ్రాం ఖాతా నుంచి తన బ్యాంక్ ఖాతాకు సొమ్మును బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
Read More
Pakistan | పాకిస్థాన్‌లో హిమపాతం.. ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

