క్షణికావేశంలో భార్య, ఇద్దరు పసిబిడ్డల దారుణహత్య
Thriple murder: ఓ వ్యక్తి క్షణికావేశం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. అభం శుభం తెలియని ఇద్దరు పసిబిడ్డలను పొట్టన పెట్టుకుంది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణాకావేశానికి లోనై

లక్నో: ఓ వ్యక్తి క్షణికావేశం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. అభం శుభం తెలియని ఇద్దరు పసిబిడ్డలను పొట్టన పెట్టుకుంది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి క్షణాకావేశానికి లోనై భార్యను, పసివాళ్లయిన ఇద్దరు బిడ్డలను హత్యచేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా ఖర్గుపూర్ ఏరియాలోని డియోరియా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. డియోరియా గ్రామానికి చెందిన ఓం ప్రకాష్, కౌశల్యాదేవి (26) ఇద్దరూ భార్యాభర్తలు. వారికి నాలుగేండ్ల ఝాన్వి, ఏడాది వయసున్న గ్యాన్వి బిడ్డలు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్లో పనిచేసే ఓం ప్రకాష్ అలియాస్ గుడ్డు తివారీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం ఇంటికి వచ్చి గురువారం భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను, ఇద్దరు బిడ్డలను హత్యచేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

