Part-time job scam | పార్ట్‌టైం జాబ్ ఆఫర్ పేరుతో రూ. కోట్లు కొట్టేశాడు
Part-time job scam : పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో అమాయకుల నుంచి రూ. 1.42 కోట్లను కొట్టేసిన 30 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనిల్ కుమార్ మీనా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ మోసానికి తెరలేపాడు.
Part-time job scam : పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో అమాయకుల నుంచి రూ. 1.42 కోట్లను కొట్టేసిన 30 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనిల్ కుమార్ మీనా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ మోసానికి తెరలేపాడు. గూగుల్, టెలిగ్రాం, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వేదికలపై రివ్యూలు, రేటింగ్స్ ఇస్తూ పార్ట్‌టైం జాబ్‌తో ఆదాయం ఆర్జించవచ్చని నమ్మబలుకుతూ స్కామర్లు బాధితుల నుంచి భారీగా వసూలు చేశారు.
భారీ రిటన్స్ వస్తాయని చెబుతూ తప్పుడు హామీలతో ప్రజలను ముంచిన నిందితులు పలువురు ప్రముఖుల నుంచి స్టాక్ మార్కెట్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టించి దోపిడీకి తెగబడ్డారు. నిందితులు ముందుగా బాధితుల నమ్మకం చూరగొనేందుకు ఆరంభంలో మంచి లాభాలను చూపించి ఆపై పెద్దమొత్తంలో పెట్టుబడులను పెట్టించి వాటిని తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని ఫోన్లను డిస్కనెక్ట్ చేస్తుంటారు.
పోలీసులు నిందితుడి నుంచి 1200 సిమ్ కార్డులు, పెద్దసంఖ్యలో మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మీనా ప్రధాన నిందితుడిగా ముంబై, జైపూర్ పోలీసులు గుర్తించారు. కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.
Read More :
H1B Visa | హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

