H1B Visa | హెచ్1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
H1B Visa | ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి.
- 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు
- ఇతర వలసేతర వీసాల ఫీజులూ పెంచిన అమెరికా
- ఏప్రిల్ 1 నుంచి అమలు
H1B Visa | వాషింగ్టన్, ఫిబ్రవరి 1: ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగడం ఇదే తొలిసారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది.
అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్-1బీ వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజును ఏప్రిల్ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.
అమెరికన్ బహుళజాతి కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే ఎల్-1 వీసా ఫీజును 460 నుంచి 1,385 డాలర్లకు, విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ-5 వీసా ఫీజును 3,675 నుంచి 11,160 డాలర్లకు పెంచుతున్నట్టు బుధవారం విడుదల చేసిన ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొన్నది. హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచుతున్నట్టు బైడెన్ సర్కారు ప్రకటించినప్పటికీ అది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్నగర్లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

