Sanitiser | శానిటైజర్ ఎక్కువగా వేసుకున్న వ్యక్తి.. పోలీసుల పొరపాటుతో మంటలు అంటుకోవడంతో..
Sanitiser | శానిటైజర్ వల్ల ఒక వ్యక్తి మరణించాడు. పోలీస్ స్టేషన్లో ఉండగా మత్తులో ఎక్కువగా శానిటైజర్ తీసుకున్న ఒక వ్యక్తి.. పోలీసులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆరువారాలపాటు చికిత్స అనంతరం

శానిటైజర్ వల్ల ఒక వ్యక్తి మరణించాడు. పోలీస్ స్టేషన్లో ఉండగా మత్తులో ఎక్కువగా శానిటైజర్ తీసుకున్న ఒక వ్యక్తి.. పోలీసులు చేసిన చిన్న పొరపాటు కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆరువారాలపాటు చికిత్స అనంతరం అతనికి లైఫ్ సపోర్ట్ తొలగించేయాలని వైద్యులు నిర్ణయించారు.
ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వెలుగు చూసింది. జేసన్ జాన్స్ (29) అనే వ్యక్తి కాట్స్కిల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అప్పటికే మత్తులో ఉన్న జేసన్.. పోలీసులతో చిన్న వాగ్వాదానికి దిగాడు. అనంతరం అక్కడే టీషర్టు విప్పేసి ఒంటి నిండా శానిటైజర్ చల్లుకున్నాడు.

ఈ సమయంలో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక అధికారి.. తన వద్ద ఉన్న టేజర్‌ను ఉపయోగించాడు. టేజర్ వెళ్లి జేసన్ శరీరానికి తగలగానే నిప్పంటుకుంది. మంటల్లో కాలిపోతున్న జేసన్‌ను చూసిన అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తనే ఎలాగో తిప్పలు పడిన జేసన్ మంటలు ఆర్పుకున్నాడు. అప్పుడు అక్కడకు తిరిగొచ్చిన అధికారుల్లో ఒక వ్యక్తి.. జేసన్‌కు బేడీలు వేయడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడకు వచ్చి ఒక బయటి వ్యక్తి జేసన్‌ను కౌగిలించుకొని సముదాయించాడు.

ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా ఆరు వారాల చికిత్స తర్వాత జేసన్‌కు లైఫ్ సపోర్ట్ తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు.. ఘటను సంబంధించిన వీడియో ఫుటేజిని కూడా విడుదల చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

