కోల్‌కతా : ఎక్స్ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిని గెస్ట్ హౌస్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ టీచర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నేరాన్ని రికార్డు చేసిన నిందితుడు ప్రియేష్ సింగ్ సెంగార్ బాధితురాలి నగ్న చిత్రాలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇనిస్టిట్యూట్‌లో జాగ్రఫీ బోధించే సెంగార్ గత ఏడాది డిసెంబర్లో ఎక్స్ట్రా క్లాస్ పేరుతో విద్యార్ధినిని సాల్ట్‌లేక్ గెస్ట్ హౌస్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను కలిసేందుకు గ్వాలియర్ రావాలని విద్యార్ధినిని కోరాడు.
విద్యార్ధిని నిరాకరించడంతో తనకు రూ 5 లక్షలు చెల్లించాలని, లేనిపక్షంలో గెస్ట్‌హౌస్‌లో తాను తీసిన వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడు. ధైర్యం కూడదీసుకున్న మహిళ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని మధ్యప్రదేశ్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆపై శుక్రవారం సెంగార్‌ను కోల్‌కతాకు తీసుకువచ్చి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.