లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. బులంద్ షహర్‌లోని అనుప్షార్ దోగ్రా జోగి గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో మేనమామ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మూడేండ్ల చిన్నారిపై కామంతో కండ్లు మూసుకుపోయిన మామ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చిన చిన్నారి తల్లితండ్రులకు నిందితుడు పరారవుతూ పట్టుబడ్డాడు. నిందితుడిని స్దానికులు తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బులంద్‌షహర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.