అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం వెలుగుచూసింది. 15 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడి(24)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక గర్భం దాల్చగా శిశువును వదిలిపెట్టిన నిందితుడితో పాటు అతడి భార్య, తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలిక గత రెండేండ్లుగా రన్చర్ద గ్రామంలోని అత్త ఇంట్లో ఉంటోంది. బాలిక తల్లితండ్రులకు ముగ్గరు ఆడపిల్లలు కావడంతో పేదరికం కారణంగా పెంచలేక మూడో కూతురిని అత్త ఇంట్లో ఉంచారు. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన కజిన్ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక గర్భం దాల్చగా ఉనాలి గ్రామంలోని నిర్జన ప్రదేశంలో శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డతో పాటు బాలికను నిందితుడి తల్లి, భార్య కలిసి స్వస్ధలానికి పంపారు. బాధితురాలి ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేశామని, నిందితుడికి సహకరించిన తల్లి, భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని స్ధానిక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ హెచ్పీ ఝాలా తెలిపారు.