లక్నో : బాలీవుడ్ కండలవీరుడిగా కనిపిస్తూ సల్మాన్ ఖాన్ డూప్‌గా పేరొందిన ఆజం అన్సారీని బహిరంగ ప్రదేశంలో శాంతికి భగ్నం కలిగించినందుకు యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలోని ఠాకూర్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని క్లాక్‌టవర్‌పై రీల్ చేస్తుండగా సల్మాన్ డూప్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతికి భగ్నం కలిగించినందుకు ఆయనకు చలాన్ కూడా జారీ చేశారు. సల్మాన్ డూప్‌కు సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో ఫాలోయర్లు ఉండగా మనోడు రోడ్డు మధ్యన తరచూ వీడియో రీల్స్ తీస్తూ నెటిజన్లను ఆకట్టుకునేవాడు.
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతూ, కొన్నిసార్లు అర్ధనగ్నంగానూ రీల్స్ చేస్తుంటాడు. దీంతో సల్మాన్ డూప్‌ను చూసేందుకు జనం ఎగబడుతుండటంతో పలుమార్లు ట్రాఫిక్ నిలిచిపోయేంది. అన్సారీకి యూట్యూబ్‌లో 1.67 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా ఆయన వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.