Ghaziabad Crime | తోటి ఉద్యోగి తల నరికి.. శవాన్ని ఇంట్లో దాచిన వ్యక్తి.. ఎందుకిలా చేశాడంటే..
ghaziabad | crime | రోజూ పనివిషయంలో గొడవ చేస్తున్నాడని తన తోటి ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కానీ అతడి శవాన్ని మాయం చేసేందుకు

కోపం, అసూయ మనిషి పతనానికి దారితీస్తాయనే దానికి ఉదాహరణ.. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘటన. రోజూ పనివిషయంలో గొడవ చేస్తున్నాడని తన తోటి ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కానీ అతడి శవాన్ని మాయం చేసేందుకు చేసే ప్రయత్నంలో విఫలమై దొరికపోయాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ నగరంలో ఒక ఫ్యాక్టరీ ఇద్దరు వ్యక్తులు సందీప్, ప్రమోద్ మెషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. తరుచూ మెషీన్ పాడైపోవడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగేది. మెషీన్ దుస్థితికి సందీప్ నిర్లక్ష్యమే కారణమని ప్రమోద్ యాజమాన్యానికి ప్రతీసారి చెప్పేవాడు. దీంతో సందీప్, ప్రమోద్ మధ్య గొడవ మొదలైంది. వారిద్దరూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేవారు. తన మీద ప్రమోద్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో సందీప్ కోపం పెంచుకున్నాడు. ప్రమోద్‌ని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సందీప్, ప్రమోద్ ఇద్దరూ ఫ్యాక్టరీ సమీపంలోని కాలనీలోనే నివసించేవారు. ప్రమోద్ తన భార్యతో నివసిస్తుండగా.. సందీప్ ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు సందీప్ మందు పార్టీ అని చెప్పి ప్రమోద్‌ని పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదని, ఇక మంచిగా.. స్నేహితులుగా ఉందామని చెప్పి.. ప్రమోద్‌ని బాగా తాగించాడు. మైకం బాగా ఎక్కిన ప్రమోద్ అక్కడే నిద్రపోయాడు. ఆ తరువాత సందీప్ తన వద్దనున్న పెద్ద కత్తితో ప్రమోద్ తల నరికేశాడు. తలలేని శవాన్ని ఒక పెట్టెలో దాచి.. తలని ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న చెత్తకుండీలో పారేశాడు.
మరుసటి రోజు ప్రమోద్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఫ్యాక్టరీ వద్దకు వచ్చి ప్రమోద్ గురించి ఆరాతీసింది. అక్కడ ప్రమోద్, సందీప్ ఇద్దరూ ఆ రోజు డ్యూటీకి రాలేదని తెలిసుకొని సందీప్ ఇంటికి వెళ్లింది. అక్కడ సందీప్ తన ఇంటికి తాళం వేసి బయటకు వెళుతుండగా.. ప్రమోద్ భార్య తన భర్త గురించి ప్రశ్నించింది. దానికి అతడు సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు సందీప్‌పై అనుమానం వచ్చింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తన కుటుంబ సభ్యులను పిలిపించి సందీప్ ఇంటి తాళం పగలకొట్టి అక్కడ వెతికింది.
సందీప్ ఇంట్లో ఆమెకు ప్రమోద్ తలలేని శవం దొరకడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి సందీప్‌ని ప్రమోద్ కుటుంబ సభ్యులు తాడుతో కట్టిపడేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేయగా.. ప్రమోద్ తలను చెత్తకుండీలో పారవేసానని ఒప్పుకున్నాడు. పోలీసులు సందీప్‌పై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టు రిమాండ్‌కు పంపించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- behead
- colleagues
- Delhi
- Ghaziabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

