హత్యకు గురైన జమ్మూ కశ్మీర్ జైళ్లశాఖ డీజీ..!
Hemant Kumar Lohia | జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అయితే, డీజీ ఇంట్లో పని చేసే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పని మనిషి పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చేపట్టారు. డీసీ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. లోహియా మరణంపై సీనియర్ పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ డిప్యూటేషన్ నుంచి తిరిగి వచ్చారు. జమ్మూకు తిరిగి వచ్చే ముందు బీఎస్ఎఫ్లో పని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదాలో పదోన్నతి పొందారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్ డీజీపీగా నియామకమయ్యారు.
30 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్లో పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో సెంట్రల్ కశ్మీర్ డీఐజీగా ఉన్నారు. లాల్ చౌక్ వద్ద జరిగిన ఫిదాయీన్ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్ డీఐజీగా పనిచేశారు. సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లడానికి ముందు సీఐడీలోనూ విశేష సేవలందించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

