భోపాల్ : మాయమాటలతో యువతి(25)ని మభ్యపెట్టి గెస్ట్‌హౌస్‌కు పిలిపించిన వ్యక్తి ఆపై ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితులను లాలా, హిమాన్షు, అభిషేక్లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోషల్ మీడియాలో యువతికి నిందితులలో ఒకరితో పరిచయమైంది. ఆపై ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని చాటింగ్ చేశారు. దీంతో యువతితో కుకింగ్ వ్యాపారం చేయిస్తానని మభ్యపెట్టిన నిందితుడు ఆమెను గ్వాలియర్‌కు పిలిపించాడు.
యువతిని గెస్ట్‌హౌస్‌లో ఉంచిన నిందితుడు అదే రోజు రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె రూంలోకి వచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.