దారుణం : బాలికలు బట్టలు మార్చుకుంటుండగా నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన సర్వెంట్ ఆపై..!
పని కల్పించి అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చేసిన సర్వెంట్ ఉదంతం దక్షిణ ముంబైలో వెలుగుచూసింది. యజమాని కూతురు (13) మేనకోడలు (11) నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి (27)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : పని కల్పించి అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చేసిన సర్వెంట్ ఉదంతం దక్షిణ ముంబైలో వెలుగుచూసింది. యజమాని కూతురు (13) మేనకోడలు (11) నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి (27)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు దక్షిణ ముంబైలోని గిఫ్ట్ షాపు యజమాని ఇంట్లో 8 ఏండ్లుగా పనిమనిషిగా కుదురుకున్నాడు.
యజమాని ఇంట్లో లేని సమయంలో మైనర్ బాలికలు బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు, వీడియోలు తీశాడు. గిఫ్ట్ షాప్ యజమాని కూతురు నిందితుడి ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతుండగా తాను బట్టలు మార్చుకునే సమయంలో అతడు తీసిన నగ్న చిత్రాలు, వీడియోలు కంటపడటంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడి ఫోన్లో తన కజిన్ నగ్న చిత్రాలు, వీడియోలు కూడా బాలికకు కనిపించాయి. బాలిక కజిన్ తరచూ వారి ఇంటికి వచ్చివెళుతుండేది.
బాలిక తన తల్లికి ఈ విషయం తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో తాను నేరం చేశానని నిందితుడు అంగీకరించాడు. గత నాలుగు నెలలుగా బాలికల నగ్న చిత్రాలు, వీడియోలు తీశానని చెప్పాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arrest
- molestation
- Servant
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

