వివాహేతర సంబంధాలపై నిలదీసిందని భార్యను కడతేర్చి..కరెంట్ స్తంభానికి వేలాడదీసి..!
తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బిహార్‌లోని సమస్తిపూర్‌లో వెలుగుచూసింది.
పట్నా : తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం బిహార్‌లోని సమస్తిపూర్‌లో వెలుగుచూసింది. సైద్పూర్ జహిద్ గ్రామంలో వివాహిత మృతదేహం కరెంట్ స్తంభానికి వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. గ్రామస్తులు ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
మృతురాలిని ఉమాదేవిగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో కట్టుకున్న భర్తే ఆమెను కడతేర్చినట్టు వెల్లడైంది. భర్త పలువురితో వివాహేతర సంబంధాలు కలిగిఉండటంతో నిలదీసినందుకు భార్యను హత్య చేసి కరెంట్ స్తంభానికి వేలాడతీశాడు. తన తల్లిని తండ్రే హత్య చేశాడని బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- illicit affair
- Kills
- MAN
- Wife
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

