బెంగళూర్ : బస్‌లో ప్రయాణిస్తుండగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ నుంచి మంగళూరుకు స్లీపర్ బస్‌లో బాధితురాలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని దక్షిణ కన్నడకు చెందిన మహ్మద్ ముస్తాఫా (24)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళ జూన్ 6న బెంగళూర్ నుంచి మంగళూర్ వెళ్లే బస్‌లో ప్రయాణిస్తోంది. జాబ్ ఇంటర్వ్యూ కోసం ఆమె బస్‌లో వెళుతుండగా జూన 7న ఉదయం 5 గంటలకు నిందితుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు.
నిందితుడి చేష్టలపై మహిళ బస్ డ్రైవర్‌కు, ప్రయాణీకులకు తెలిపింది. వారంతా నిందితుడిని వారించినా గట్టిగా మాట్లాడుతూ తోటి ప్రయాణీకులను బెదిరించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.