చండీఘఢ్ : పంజాబ్లో దారుణం జరిగింది. బర్నాలాలో మైనర్ బాలుడిపై శుక్రవారం 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్యా యత్నం చేయడం కలకలం రేపింది. చిన్నారి(8)ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇంటి సమీపంలోని ప్లేగ్రౌండ్లో చిన్నారి ఆడుకుంటుండగా అతడిని నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లిన నిందితుడు లైంగిక వేధించి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారిని చంపేందుకు ప్రయత్నించాడు. రక్తపు మరకలున్న దుస్తులను బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.