భోపాల్ : మైనర్ బాలికపై కన్నేసిన బావ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే ప్రాంతంలో వెలుగుచూసింది. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో పరిశీలించిన వైద్యులు ఆమె మూడునెలల గర్భవతిగా నిర్ధారించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తరచూ తమ ఇంటికి వచ్చిపోయే బావ లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఓ రోజు పశువులు మేపేందుకు వెళ్లిన తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.