భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెందిన దంపతులు శిరీష, ప్రవీణ్‌లకు మధ్య బుధవారం గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త ప్రవీణ్ భార్య శిరీషపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు విని స్థానికులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శిరీష మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Eturnagaram
- Husband
- Mulugu
- Set Fire
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

