Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే ఒక వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను చంపితే రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి గోవింద్‌పురి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు చెప్పాడు.
వీళ్లందరూ కలిసి 33 ఏళ్ల యువతిని మట్టుబెట్టారు. ఈ కేసులో మృతురాలి భర్తతోపాటు, అతనికి సాయం చేసిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వేరే యువతితో ఉన్న వైవాహికేతర సంబంధం వల్లనే తాను భార్యను చంపించానని నిందితుడు విచారణలో వెల్లడించాడు.