న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ మర్డర్ కేసును ఢిల్లీ పోలీసులు రెండు రోజుల్లో ఛేదించారు. 300 సీసీటీవీల ఫుటేజ్, ఒక మెట్రో కార్డ్ సహాయంతో నిందితులను గుర్తించారు. వారిలో ఒకరిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ సివిల్ లైన్స్‌లో జూపిటర్ బిల్డర్స్ డైరెక్టర్ రామ్ కిషోర్ అగర్వాల్ బంగ్లాలోకి ఆదివారం చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఆయనను హత్య చేశారు. అట్టపెట్టెల్లో దాచిన డబ్బును దోచుకున్నారు. అయితే ఇద్దరు నిందితులు మాస్కులు ధరించడం, వారు వినియోగించిన బైక్‌కు నకిలీ నంబర్ ప్లేట్ ఉండటంతో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది.
దీంతో ఆ ప్రాంతంలోని 300కుపైగా సీసీటీవీల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లో నిందితులు ఇద్దరు శనివారం రాత్రి 10 గంటలకు ఆ బంగ్లా వద్దకదు వచ్చి సమీపంలో బైక్‌ను పార్క్ చేశారు. తర్వాత సివిల్ లైన్స్ మెట్రో స్టేషన్‌కు వెళ్లి మెట్రో రైళ్లలో పలు ప్రాంతాల్లో తిరిగారు. ఒక నిందితుడు న్యూ ఢిల్లీ స్టేషన్‌కు అక్కడి నుంచి సమయపూర్ బద్లీకి మెట్రో రైల్లో వెళ్లాడు. సమయ్‌పూర్ బద్లీ స్టేషన్ నుంచి ఆటోలో తన ఇంటికి చేరుకున్నాడు. మరో వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీపాటు అతడు ఉండే శివారులోని పశ్చిమ ఢిల్లీ ప్రాంతానికి వెళ్లాడు.
మరునాడైన ఆదివారం వారిద్దరూ ఆటోలో సివిల్ లైన్స్‌లోని బిల్డర్ రామ్ కిషోర్ అగర్వాల్ బంగ్లాకు చేరుకున్నారు. బిల్డర్‌ను హత్య చేసి డబ్బులతో ఆ బంగ్లాకు సమీపంలో ఉంచిన తమ బైక్‌పై పరారయ్యారు. హై-ప్రొఫైల్ మర్డర్ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 300కుపైగా సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుల కదలికలను గుర్తించారు. ఒక నిందితుడి వద్ద ఉన్న మెట్రో కార్డ్‌పై నిఘా పెట్టారు. మంగళవారం ఆ కార్డును వినియోగించిన నిందితుడ్ని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. మరో నిందితుడి గురించి అతడ్ని ప్రశ్నించారు.
కాగా, ఈ హత్యా దోపిడీ ప్లాన్‌కు బంగ్లాలోని ఒక వ్యక్తి సూత్రధారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టైన నిందితుడు ఏడాదిన్నర కిందట ఆ బంగ్లాలో పని చేశాడని, నేర చరిత్ర ఉన్న అతడికి ఆ ప్రాంతం గురించి బాగా తెలుసని పోలీసులు తెలిపారు. అందుకే వారు సులువుగా బంగ్లాలోకి ప్రవేశించి బిల్డర్‌ను హత్య చేసి డబ్బులు చోరీ చేశారని చెప్పారు.
दिल्ली के सिविल लाइन्स में बिल्डर रामकिशोर अग्रवाल की हत्या में शामिल लोगों का सीसीटीवी,2 संदिग्ध घर की बाउंड्री वाल कूदकर बाइक से फरार हो जाते हैं,एक शख्स ने पीछे बैग टांगा हुआ है pic.twitter.com/g644LYQYg3
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) May 2, 2022