Loan Apps | లోన్ యాప్స్‌పై కొరడా : 3500 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్
యూజర్లను తప్పుదారి పట్టిస్తూ ప్లేస్టోర్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను (Loan Apps) సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
న్యూఢిల్లీ : యూజర్లను తప్పుదారి పట్టిస్తూ ప్లేస్టోర్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను (Loan Apps) సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. రుణాలు ఇస్తామని హామీలు గుప్పిస్తున్న లోన్ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్స్‌లో కోకొల్లలుగా ఉండగా వాటిలో చాలా వరకూ చట్టవిరుద్ధంగా నడిచేవే. ఈ తరహా యాప్‌లపై గూగుల్ ఉక్కుపాదం మోపింది. సరైన అవగాహన, వెరిఫికేషన్ లేకుండా కొందరు యూజర్లు ఈ యాప్స్‌ను వాడి సమస్యల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఇలాంటి యాప్స్ బారినపడకుండా యూజర్లను కాపాడే ఉద్దేశంతో ప్లేస్టోర్ నిబంధనలు ఉల్లంఘించిన 3500కుపైగా లోన్ యాప్స్‌ను 2022లో ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.
పర్సనల్ లోన్స్ సహా ఆర్ధిక సేవలను అందించే యాప్స్ పాలసీని 2021లో గూగుల్ అప్డేట్ చేసింది. 2021లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనల్లో భాగంగా పర్సనల్ లోన్స్ జారీ చేసేందుకు ఆర్బీఐ నుంచి తాము లైసెన్స్ పొందినట్టు ధ్రువపరుస్తూ లైసెన్స్ కాపీని యాప్ డెవలపర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆయా యాప్స్ లైసెన్స్ పొందని పక్షంలో లైసెన్డ్స్ లెండర్స్‌కు తమ ప్లాట్‌ఫాం వేదికగా ఉండేందుకే అనుమతిస్తారు. ఈ యాప్ డెవలపర్లు పార్ట్నర్ ఎన్బీఎఫ్సీ, బ్యాంకుల పేర్లు, ఇతర వివరాలను కూడా సమర్పించాలని 2022లో గూగుల్ మరిన్ని నిబంధనలను తీసుకువచ్చింది.
పర్సనల్ లోన్ యాప్ డిక్లరేషన్‌లో ఆయా వివరాలన్నింటినీ పొందుపరచాల్సి ఉంటుంది. యూజర్ కాంటాక్ట్స్, ఫొటోలు యాక్సెస్ చేయడం ద్వారా పర్సనల్ లోన్లు ఇస్తామని హామీ ఇచ్చే యాప్స్‌పై కూడా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ చర్యలు చేపట్టింది. ప్లేస్టోర్‌లో అన్ని యాప్స్ తమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా గూగుల్ ఎప్పటికప్పుడు తన పాలసీలను అప్డేట్ చేస్తూ సమీక్షిస్తోంది. యూజర్ల ప్రయోజనాలు కాపాడటంతో పాటు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని గూగుల్ చెబుతోంది.
లోన్ యాప్స్‌ను వాడే ముందు కస్టమర్లు అవి చట్టబద్ధతను కలిగిఉన్నాయా, అన్ని నిబంధనలను పాటిస్తున్నాయా అని యూజర్లు పరిశీలించడంతో పాటు రివ్యూలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా యాప్స్ షరతులు, నిబంధనలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకునేముందు ఆర్ధిక నిపుణులనూ సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోవడం మేలు.
Read More
Amazon Prime | యూజర్లకు అమెజాన్ షాక్.. సబ్స్క్రిప్షన్ చార్జీలు భారీగా పెంపు!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

