రంగారెడ్డి జిల్లా కోర్టు : చిట్టీల పేరుతో వందల మంది అమాయకుల వద్ద డబ్బులను తీసుకుని ఉడాయించిన మోసగాడు మారం భానుమూర్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్.తిరుపతి తీర్పునిచ్చారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం… మల్కాజిగిరిలోని మారుతినగర్లో నివాసం ఉండే మారం భానుమూర్తి అదే ప్రాంతంలో రిజిష్టర్డ్ చిట్ఫండ్గా చెప్పి అక్రమంగా సుమారు 5వందల మంది దగ్గర లక్ష నుండి అయిదు లక్షల వరకు చిట్టిలు వేస్తున్నానని సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసాడు.
చిట్టి కాలపరిమితి పూర్తయిన తరువాత పలువురు తిరిగి చెల్లించాలని కోరగా 2011జనవరి 2నాడు ఇంట్లో నుండి పారిపోయాడు. దీంతో వందాలాది మంది బాధితులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు మారం భానుమూర్తితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కుతరలించారు.
అనంతరం బాధితులను విచారించిన పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు, సాక్షాదారాలను పరిశీలించిన మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానం నిందితుడు మారం భానుమూర్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది.