Road Accident | హర్యానా సిర్సా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెహనాఖేడా గ్రామ సమీపంలో సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
మెహనాఖేడా గ్రామానికి చెందిన ఓ కుటుంబం కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడ్డ ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.