అబిడ్స్ : రహీంపురాలోని జరి కాటన్ గోడౌన్లో షార్ట్‌సర్క్యూట్ తో మంటలంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మంగళ్‌హాట్ కార్పొరేటర్ ఎం శశికళ కృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయించేందుకు చర్యలు తీసుకున్నారు.
జరి కాటన్ గోడౌన్లో షార్ట్‌సర్క్యూట్ మూలంగా పొగలు వ్యాపించి మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. జలమండలి అధికారులు నీటిని అందించగా అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పి వేశారు.