యువతిపై ఫేస్బుక్ ఫ్రెండ్ అత్యాచారం.. నగ్న వీడియోలతో బెదిరింపులు
Karnataka | ఓ యువతిపై ఫేస్బుక్ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు

బెంగళూరు : ఓ యువతిపై ఫేస్బుక్ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో ఆమె పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఈ యువతికి ఫేస్బుక్లో హర్ష గౌడ అనే యువకుడు పరిచయం అయ్యాడు. 2014లో వీరిద్దరికి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడగా, తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. దీంతో హర్ష గౌడ ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయడం ఆమె మానేసింది.
జాబ్ కోసమని కాల్ చేస్తే.. కామంతో రగిలిపోయాడు..
సదరు యువతి ఇటీవలే హర్ష గౌడకు ఫోన్ చేసి జాబ్ కావాలని కోరింది. జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికిన ఆ యువకుడు, యువతిని స్థానికంగా ఉండే వైరస్ బార్ వద్దకు రమ్మన్నాడు. జనవరి 16న ఆమె అతని వద్దకు వెళ్లగా.. కారులో కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత బీర్ తాగాలని బలవంతం చేశాడు. హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దగ్గర్లోనే తనకు గది ఉందని, అక్కడికి వెళ్దామని బతిమాలాడు. కామంతో రగిలిపోతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ప్రతిఘటించడంతో.. చెంపపై లాగి కొట్టాడు..
బాధిత యువతి ప్రతిఘటించడంతో.. ఆమె చెంపపై లాగి కొట్టాడు. ఆ తర్వాత ఆమె బట్టలను విప్పేసి వెనుక సీట్లోకి లాగాడు. నగ్నంగా ఉన్న బాధితురాలిని ఫోటోలు, వీడియోలు తీశాడు. అనంతరం అత్యాచారం చేశాడు. ఇక ఆమెకు బట్టలు ఇచ్చేశాడు.
బయటకు చెబితే.. మీ చెల్లి వీడియోలను కూడా..
ఈ విషయాన్ని బయటకు చెబితే నీ నగ్న వీడియోలతో పాటు మీ చెల్లి నగ్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. నీ చెల్లి కూడా ఈ మాదిరిగానే తన చేతిలో మోసపోయిందని హర్ష గౌడ చెప్పాడు. తాను అడిగినప్పుడల్లా తన కోరిక తీర్చాలని బాధితురాలిని ఆదేశించాడు.
పోలీసు స్టేషన్ ఎదుట బాధితురాలి ధర్నా
తనకు జరిగిన అన్యాయంపై మదనయాకనహల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారం రోజులు గడిచినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో నిన్న బాధితురాలు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేసింది. ఇక చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేశారు. జడ్జి ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

