కోల్‌కతా : తన క్లాస్‌మేట్‌పై ఇంజనీరింగ్ విద్యార్ధి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది. బాధితురాలు నిందితుడు పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. యువతి కుటుంబ సభ్యులు ఎకోపార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చిన క్లాస్‌మేట్‌పై నిందితుడు లైంగిక దాడికి పాల్పడగా ఆమె ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు జరిగిన విషయం తెలిపింది.
లైంగిక దాడి అనంతరం యువతి ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతికి నిందితుడు మత్తుమందు ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడా అనేది పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని చెప్పారు.