Crime News | ఈశాన్య ఢిల్లీలోని ఒక క్లినిక్‌లో పని చేస్తున్న నర్సు (34)పై లైంగిక దాడి చేశాడన్న అభియోగంపై ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. రెండేండ్ల క్రితం 2021 ఆగస్టులో సుందర్ నగరిలోని క్లినిక్‌లో పని చేస్తున్న నర్సుపై సదరు డాక్టర్ లైంగిక దాడి చేయడంతోపాటు ఆ ద్రుశ్యాలను వీడియో తీశాడని పోలీసులు చెప్పారు. ఆ వీడియోను చూపి తన వద్ద డాక్టర్ రూ.7 లక్షలు కాజేశాడని బాధితురాలు తెలిపింది.
ఈ మేరకు ఈ నెల 13న బాధితురాలు నంద్ నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంబంధిత డాక్టర్ పై ఐపీసీలోని 376, 328 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న క్లినిక్ కొంత కాలం క్రితం మూసేశారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు.