Delivery Agent | అడ్రెస్ అడిగినందుకు.. డెలివరీ ఏజెంట్‌పై కత్తితో దాడి చేసిన మహిళ
Delivery Agent | అడ్రెస్ అడిగిన ఓ డెలివరీ ఏజెంట్ (Delivery Agent)ను మహిళ కత్తితో దాడి చేసి గాయపరిచింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటు చేసుకుంది.
Delivery Agent | అడ్రెస్ అడిగిన ఓ డెలివరీ ఏజెంట్ (Delivery Agent)ను మహిళ కత్తితో దాడి చేసి గాయపరిచింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ (Delhi)లోని ద్వారకా సెక్టార్ 23 (Dwarka Sector 23)ప్రాంతానికి కస్టమర్స్‌కు ప్రాడక్ట్స్‌ను డెలివరీ చేసేందుకు గోలూ అనే డెలివరీ ఏజెంట్ వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళ (Woman)ను అడ్రెస్ (Address) అడిగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 42 ఏళ్ల మహిళ గోలూపై దాడికి దిగింది. అతన్ని స్కూటీపై నుంచి కిందకి లాగి కత్తి (Knife)తో మూడు, నాలుగు సార్లు దారుణంగా దాడి చేసి గాయపరిచింది. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేసింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు (Police) మహిళను నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి యత్నించింది. దీంతో స్థానిక మహిళల సాయంతో ఆ మహిళ చేతిలోని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె మరింత కోపంతో ఓ కానిస్టేబుల్ చేతిలోని లాఠీని లాక్కుని సమీపంలోని పోలీసు వాహనం, ఇతర కార్లను ధ్వంసం చేసింది. ఎలాగోల ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో గాయపడిన డెలివరీ ఏజెంట్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అయితే, ఆ మహిళ స్థానిక డీడీఏ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటోందని స్థానిక మహిళలు తెలిపారు. గతంలో కూడా కొందరు స్థానికులతో ఇలాగే ప్రవర్తించిందని, కొందరిపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
Also Read..
Google Employee | గంట పని.. జీతం మాత్రం రూ.1.2 కోట్లు..!
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

