పెద్దపల్లి : అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి పట్టణం సాగర్ రోడ్లో ఓ గోదాంలో అక్రమంగా గుట్కాలు నిల్వ ఉంచారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ సీహెచ్ నరసింహా రావు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సాగర్ రోడ్‌లోని మోహన్ లాల్‌కు చెందిన గోదాంలో తనిఖీ నిర్వహించారు.
ఈ సోదాల్లో 1,11,128 రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.