చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. 12 ఏండ్ల బాలుడు 17 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడిని తంజావూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందినవారు కాగా ఇద్దరూ స్కూల్ విద్యను సగంలోనే ముగించారు. బాలికకు ఇటీవల కడుపు నొప్పి రాగా ఏప్రిల్ 16న రాజా మిరసుందర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించగా ఆమె తొమ్మిది నెలల గర్భవతని నిర్ధారించారు.
ఆ మరుసటి రోజే బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో తంజావూరు పోలీసులు బాలికను ప్రశ్నించారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తంజావూరులోని జువెనైల్ హోంకు తరలించారు.