బెంగుళూరు: గోవాలో నాలుగేళ్ల కుమారుడిని స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్(Suchana Seth) హత్య చేసిన విషయం తెలిసిందే. కర్నాటకలోని చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేశారు. మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీకి సీఈవోగా ఉన్న ఆమె.. తన కుమారుడిని హత్య చేయడానికి 3 నెలల ముందు ఇన్‌స్టాలో చివరి పోస్టు పెట్టింది. అక్వేరియం వద్ద ఆడుకుంటున్న కుమారుడి ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. వాట్ విల్ హ్యాపెన్ అని ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ ఇచ్చింది.
కాండలిమ్‌లోని ఓ హోటల్లో ఆదివారం కుమారుడిని చంపి, అతని శరీరాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టి.. కారులో బెంగుళూరుకు వెళ్తున్న ఆమెను గోవా పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే సుచనా సేథ్ తన భర్త నుంచి దూరంగా ఉంటోందని, ఆ ఇద్దరి మధ్య వివాకులు తుది దశలో ఉన్నాయని, కానీ మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం తెలియదని నార్త్ గోవా ఎస్పీ నిదిన్ వాల్సన్ తెలిపారు.
సుచనా భర్త వెంకట్ రామన్ ఇండోనేషియాలో ఉన్నాడు. అయితే విడాకుల్లో భాగంగా.. కుమారుడిని ప్రతి ఆదివారం తండ్రి వద్దకు తీసుకువెళ్లాలన్న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కానీ తండ్రి వద్దకు కుమారుడిని తీసుకువెళ్లడం ఇష్టంలేకనే ఆ పిల్లోడిని తల్లి చంపినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. కొడుకును చంపి, అతని శవాన్ని కారులో తీసుకువెళ్తున్న సుచనా సేథ్‌ను క్యాబ్ డ్రైవర్ ఆధారంగా పట్టుకున్న విషయం తెలిసిందే.
#WATCH | Panaji: Goa Police takes the woman accused of killing a four-year-old boy into custody and presents her before Mapusa court. https://t.co/JX2GFdT0XN pic.twitter.com/Fii51YjBlT
— ANI (@ANI) January 9, 2024