జియాగూడ : అక్రమంగా ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసి 11 మంది పేకాట రాయుళ్లను ఆరెస్ట్ చేసిన సంఘటన కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో అదివారం చోటు చేసుకుంది. కుల్సుంపురా పోలీసుస్టేషన్ అడిషనల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం…
జియాగూడ ప్రధాన రోడ్డులోని బీమ్నగర్ ప్రాంతంలో రాంబాయి టిఫిన్ సెంటర్ పక్కనే గల ఓ ఇంట్లో సయ్యద్ హసన్ అక్రమంగా పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడి చేసిన పోలీసులు వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుండి 25380 నగదు, 52 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.