ముంబై : మహిళా పోలీస్ అధికారిని బెదిరిస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతున్నముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఏపీఐ)ను అరెస్ట్ చేశారు. మహిళా అధికారి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని దీపక్ దేశ్‌ముఖ్‌గా గుర్తించారు.
కురార్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ర్యాంకులో పనిచేస్తున్న మహిళా పోలీస్ అధికారి ఫిర్యాదు ఆధారంగా ఉత్తర ముంబైలో దేశ్‌ముఖ్‌పై కేసు నమోదైంది. మహిళా పోలీస్ అధికారి ఫిర్యాదుపై తనను కంట్రోల్ రూంకు బదిలీ చేశారనే ఆగ్రహంతో దీపక్ దేశ్‌ముఖ్ ఆమెను బెదిరించాడు. ఆపై ఆమెకు అభ్యంతరకర మెసేజ్‌లను పంపుతూ వేధించాడు. నిందితుడి ఆగడాలతో విసిగిన మహిళా అధికారి దేశ్‌ముఖ్‌పై ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు.