Crime news | అబ్దుల్లాపూర్ మెట్లో ప్లంబర్‌పై హత్యాయత్నం?
Crime news | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి తీవ్ర గాయలై రక్తం మడుగులో పడి ఉన్నాడు.

హైదరాబాద్ : ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
స్థానకుల కథనం మేరకు.. జనుమ్ కాలనీ 3వ బ్లాక్ 22 నంబర్ ఇంటిలో ఉంటున్న జివ్వాజి నర్సింహ (36) వృత్తి రీత్యా ప్లంబర్. తన తల్లిదండ్రులకు ,భార్య కు దూరంగా చాలా రోజుల నుంచి ఒక్కడే నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి తనకి తెలిసిన వారికి, పక్కింటి వారికి ఫోన్ చేసి నాకు చాలా భయంగా ఉంది..ఎవరో నన్ను చంపటానికి వస్తున్నారు అని చెప్పినట్లు తెలుస్తున్నది.
బుధవారం తెల్లవారి చుస్తే బయట నుంచి తాళం పెట్టిన గదిలో రక్తం మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యా ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

