తప్పిన రైలు ప్రమాదం.. ఊడిన బోగి చక్రం

పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. నార్కటిగంజ్-రక్సౌల్ (05210) ప్యాసింజర్ రైలు, కుమార్‌బాగ్ స్టేషన్ సమీపంలో పట్టాలు మారుతుండగా ఒక కంపార్ట్‌మెంట్‌కు చెందిన రైలు చక్రం ఊడింది. ఈ విషయాన్ని గ్రహించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమస్తిపూర్ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

