Suicide | మద్యం మానేసి.. మానసిక సమస్యలకు చేరువై..

బంజారాహిల్స్ : మద్యం మానేసిన తర్వాత మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన కోడిపుంజుల శ్రీనివాస్ (35) అక్కడే ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసేవాడు. అతడికి ఐదేండ్ల క్రితం జవహర్‌నగర్‌కు చెందిన సురేఖతో పెండ్లయింది. వారికి 15నెలల వయస్సుగల పాప ఉంది.
గత కొన్నినెలలుగా మద్యానికి బానిసగా మారిన శ్రీనివాస్ భార్యను వేధిస్తుండేవాడు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పద్దతి మార్చుకుంటానని చెప్పిన శ్రీనివాస్ మద్యం మానేశాడు. అయితే మద్యం మానేసిన తర్వాత శ్రీనివాస్ మానసిక పరిస్థితిలో తేడాలు వచ్చాయి. దాంతో కొన్నాళ్లపాటు బావమరిది ఇంట్లో ఉంటే పరిస్థితి బాగుపడుతుందనే నమ్మకంతో ఈ నెల 11న జవహర్‌నగర్‌కు తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఈనెల 13న తాను ఊరికి వెళ్తానంటూ చెప్పడంతో కొన్నాళ్లపాటు ఇక్కడే ఉంటే మంచిదని కుటుంబ సభ్యులు చెప్పారు. దాంతో మనస్థాపానికి గురయిన శ్రీనివాస్ కూరగాయల కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు బావమరిది వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

